ఆపరేషన్
సక్సెస్ పేషెంట్ డెడ్ అయినట్లు
టాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు అలానే తయారయింది.
కరోనా తర్వాత ఓ టీ టీ లో విడుదలయ్యే సినిమాల సంఖ్య పెరిగినా కూడా కొన్ని సినిమాలు ధైర్యం చేసి థియేటర్లలోకి వచ్చి మెల్లమెల్లగా ప్రేక్షకులకు థియేటర్లకు అలవాటు చేశాయి. సదరు సినిమాలు వచ్చే సమయానికి థియేటర్లో ఒక్కరంటే ఒక్క ప్రేక్షకుడు కూడా చూడడానికి ఇష్టపడలేదు. కానీ ఆ సినిమాలు ఎంతో కష్టంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. అయితే ఇప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరు గా మారిపోయింది.
ఓవైపు 50% కెపాసిటీ, మరోవైపు
థియేటర్ టికెట్ రేట్ల తగ్గింపు వీటన్నిటి మధ్య ప్రేక్షకులకోసం థియేటర్లకు
సినిమా లు రావడం
సినిమా వారికి ఎంతో సంతోషాన్నిచ్చింది. అయితే తాజాగా రెండు పెద్ద సినిమాలు ఓ టీ టీ లోకి రావడం ఒక్కసారిగా
సినిమా వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.
నాని టక్ జగదీష్, అలాగే నితిన్ మ్యాస్త్రో సినిమాలు రెండు వేరు వేరు ఓ టీ టీ ప్లాట్ఫామ్ లలో
సెప్టెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే అదే రోజున థియేటర్లలో అక్కినేని
నాగచైతన్య నటించిన
లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో ఒక్కసారిగా
టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయినట్లు అయ్యింది.
ఓ టీ టీ లో విడుదల చేసే
లవ్ స్టోరీ సినిమా ఓవైపు థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు మరోవైపు పోటాపోటీగా ఆరోజున తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
కరోనా తర్వాత ఇప్పటి వరకు దాదాపు పది సినిమాలు థియేటర్లలోకి రాగా అవి ప్రేక్షకులను మెప్పించడంలో కొంత విఫలమయ్యాయి.
లవ్ స్టోరీ తప్పకుండా ప్రేక్షకులను మెప్పించే
సినిమా అవుతుందని నిర్మాతలు ధీమా గా ఉండగా ఇప్పుడు రెండు పెద్ద సినిమాలు వారి ఆశలను అడియాశలు చేశాయి. దాంతో
లవ్ స్టోరీ సినిమా ఇప్పుడు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు చూడాలి.