ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ లలో నిర్మాతల పరిస్థితి చాల అగమ్యగోచరంగా ఉంది అన్నవార్తలు వస్తున్నాయి. ‘టక్ జగదీష్’ మూవీని ఓటీటీ కి ఇచ్చినందుకు ధియేటర్ల యజమానులు తీవ్ర అసహనానికి లోను కావడంతో ఏకంగా వారంతా నాని సినిమాలను భవిష్యత్ లో ధియేటర్లలో ప్రదర్శించము అన్న బెదిరింపుల స్థాయికి వెళ్ళడంతో నాని చాకచక్యంగా వ్యవహరించి ధియేటర్ల యజమానులు డిస్ట్రిబ్యూటర్ల కోపాన్ని చల్లార్చాడు.
ఈ వ్యవహారం సద్దుమణిగింది అని అందరు భావిస్తూ ఉంటే ఇప్పుడు కంగనా రనౌత్ ‘తలైవి’ మూవీ ఇంకా విడుదల కాకుండానే ఈమూవీ నిర్మాతలకు ఓటీటీ ధియేటర్ల యజమానులకు మధ్య మళ్ళీ రగడ మొదలైంది. ఈమూవీని తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో ఒకేసారి ఈ నెల 10వ తారీఖున విడుదల చేస్తున్నారు. ఈ మూవీ విడుదలైన రెండు వారాలకు ఓటీటీ లో రాబోతోంది.
ఇప్పుడు ఈవిషయమే చిచ్చును రగిలిస్తోంది. ధియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీ లో విడుదల అయితే జనం ఎక్కడ వస్తారు అంటూ ఈ గ్యాప్ ను నాలుగు వారాలకు పెంచమని నిర్మాతల పై డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంత గ్యాప్ ఉంటే తాము ఒప్పుకున్న ఎమౌంట్ ను ‘తలైవి’ నిర్మాతలకు ఇవ్వడం జరగదని ఓటీటీ ప్రతినిధులు తెగేసి చెపుతున్నట్లు టాక్.
దీనితో భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీని ఓటీటీ ఆఫర్ వదులుకోలేక పూర్తిగా ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారు అన్న నమ్మకం లేక ఈమూవీ నిర్మాతలు తెగ సతమతమైపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి మన టాలీవుడ్ కు చెందిన అనేక సినిమా నిర్మాతలు కూడ ఎదుర్కొనడం హాట్ న్యూస్ గా మారింది. కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రానప్పటికీ జనం హోటల్స్ కు బార్లకు ఎటువంటి భయాలు లేకుండా వెళుతుంటే ధియేటర్లకు జనం ఎందుకు రావడం లేదు అన్నవిషయం ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగితే ఇక సినిమాలు తీసే నిర్మాతలు ఉండకపోవచ్చు అన్న కామెంట్స్ వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి