రెబల్ స్టార్ ప్రభాస్-హాట్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా 'జిల్ ' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` సినిమా తెరకెక్కుతోన్న సంగతి  తెలిసిందే. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఇక 1975 కాలం పీరియాడిక్ లవ్ స్టోరీ ఇది. ఆనాటి కాలాకానికి తీసుకెళ్లే అద్భుతమైన సెట్స్ నడుమ ఈ సినిమా చిత్రీకరణ జరిపారట. మెజార్టీ పార్ట్ షూటింగ్ అంతా కూడా ఇటలీ దేశం అందాల నడుమ జరిగింది.  అక్కడ కూడా ప్రత్యేకంగా కొన్ని అద్భుతమైన సెట్లు వేసి ఈ సినిమా సీన్లు తెరకెక్కించారంటే? అర్ధం చేసుకోండి. ఈ సినిమాలో ఇటలీ నేపథ్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందోనని.ఇక అన్నింటిని  మించి కూడా రొమాంటిక్ లవ్ స్టోరీ హైలైట్ కాబోతుందని ఇప్పటికే కథనాలు ఫ్యాన్స్ ని బాగా వేడెక్కిస్తున్నాయి.

ఇటలీ అందాల నడుమ ఎవరూ ఊహించని రేంజిలో రొమాన్స్ కుదిరిందని కథనాలు వినిపిస్తున్నాయి.డార్లింగ్ ప్రభాస్- హాట్ బ్యూటీ పూజా హెగ్డే ల మధ్య సీన్లు 1975 కాలానికి తీసుకెళ్లి...ఇక వారిద్దరి మధ్య ఇటలీ రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆ సీన్ల కోసం... పాటల చిత్రీకరణ కోసమే కొన్ని కోట్లాది రూపాయలు  ఖర్చు పెట్టడం జరిగిందట. ఇక పాటల చిత్రీకరణలో  పూజా హెగ్డే ప్రభాస్ ధరించిన కాస్ట్యూమ్స్ అదిరిపోయాయట. వాటిని బట్టి సినిమాలో లవ్ స్టోరీకి ఎంత ప్రాధాన్యత ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఇక రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా ఎంత మాత్రం ఫీల్ అనేది అసలు మిస్ కాకుండా రక్తికట్టేలా వాస్తవాన్ని ప్రతిబింబించేలా రియలిస్టిక్ గానే రొమాంటిక్ సన్నివేశాల్లో  నటించినట్లు సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎంతో ప్రత్యేక ఆకర్ణణగా నిలుస్తాయని సమాచారం వినిపిస్తోంది.ఇక చూడాలి ఈ సినిమా ఫ్యాన్స్ ని ఎంతగా ఆకట్టుకుంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: