ఒక సినిమా హిట్ లేక ఫ్లాప్ అన్న అంశాన్ని డిసైడ్ చేసేది ప్రేక్షకులే. స్టార్ హీరో సినిమాలంటే ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి. తారాగణం, మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్స్ ఇలా ప్రతి ఒక్క దానిపై ఎక్స్పెక్టేషన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి అగ్ర హీరోల సినిమాలంటే అభిమానుల అంచనా ప్రకారం క్వాలిటీ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు నిర్మాతలు భారీగా బడ్జెట్ ను పెడుతుంటారు, లేదులేదు పోస్తుంటారు. తగ్గేదేలే అన్నట్టు ఎందులోనూ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. స్టార్ హీరోతో చిత్రం అంటే బడ్జెట్ ప్రణాళిక పక్కన పెట్టి హీరో చెప్తే నిర్మాతలు వినాల్సిందే అన్న మాటలు కూడా చాలా సార్లు విన్నాం. కొన్ని సార్లు ఒక్కో సీన్ కోసం కోట్లు ఖర్చు పెడుతుంటారు. ఒక సినిమా రిలీజ్ అయ్యాక అది హిట్టా, ఫట్టా అని ఈజీగా తేల్చి చెప్పేస్తారు. కానీ, ఒక సినిమా తీయాలంటే దాని వెనక ఎంత కష్టం ఉందనే విషయం "నేనింతే" సినిమా చూస్తే అర్దం అవుతుంది.

రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక సినిమా వెండి తెరపై మెరవాలంటే తెర వెనుక ఎంత కష్టం ఎందరి శ్రమ ఉంటుందనే విషయం కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. కానీ వాస్తవాలను స్వీకరించడం కాస్త కష్టమైన పనే...ఈ మాట ఎందుకు అనాల్సొచ్చింది అంటే సినిమా కష్టాల గురించి..వాస్తవాల గురించి తెలియచేసిన "నేనింతే" సినిమా కూడా ఫ్లాపునే మిగిల్చింది. కానీ కొందరి అభిప్రాయం ఏంటంటే కంటెంట్ లేకుంటే అది ఎంత పెద్ద స్టార్ హీరో చిత్రమైనా ఎన్ని అంచనాలు ఉన్నా కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ అవదు అని, ఇక ఒక అగ్ర హీరోతో సినిమా అంటే భారీ బడ్జెట్ తో కూడుకున్న పని. అన్ని భారీగానే అందించాల్సి ఉంటుంది అలాంటి సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే నిర్మాత పని అంతే. భారీగా నష్టపోయేది నిర్మాతనే.

ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ ఆ సినిమా కి సంబంధించిన అందరి మీద ఎంతో కొంత ఉంటుంది. డిస్టిబ్యూటర్స్ కూడా ఎక్కువ నష్టపోతారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన రామ్ చరణ్ తేజ్ "ఆరెంజ్" చిత్రం ఫ్లాప్ అవడంతో ఆ సినిమా నిర్మాత కొణిదెల నాగబాబు ఒక్కసారిగా ఏ స్థాయికి పడిపోయారో అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో అయితే ఆ ఆర్ధిక భారం తట్టుకోలేక ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడని స్వయంగా నాగబాబే ఓ ఇంటర్వ్యూ లో అన్నారు. కాబట్టి ఏ సినిమా ఎప్పుడు ఎలా డిజాస్టర్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేము. ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా సినిమాలు తెరకెక్కించడమే ఫలితం గురించి వారికే వదిలెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: