తెలుగు సినిమా హాస్యనటులలో ప్రేక్షకులను తమ హాస్యంతో కడుపుబ్బ నవ్వించి వారిని పొట్ట చెక్కలు అయ్యే విధంగా నవ్వించే హాస్యనటులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి లో ఒకరు ధర్మవరపు సుబ్రమణ్యం. టీవీ రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రజా నాట్య మండలి తరఫున ఎన్నో నాటకాలలో ప్రదర్శనలు ఇచ్చి మరింత అనుభవం పొందాడు. మొదట్లో దూరదర్శన్లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత చిత్ర రంగంలో అవకాశాలు కొట్టేసి హాస్య పాత్రలతో తనదైన ముద్ర వేసుకొని ప్రముఖుల స్థానాల్లో కొనసాగాడు.

నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన తోకలేని పిట్ట అనే సినిమా చేసి మంచి సక్సెస్ సాధించాడు. అలాగే 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేశాడు. 2004 నుండి 2013 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి గా కొనసాగారు. జయమ్ము నిశ్చయమ్మురా చిత్రంతో ఆయనకు తొలిసారిగా సినిమాలలో పనిచేసే అవకాశం వచ్చింది. జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమా తర్వాత ఆయన పలు కామెడీ పాత్రలు చేసి ప్రేక్షకులను బాగా అలరించాడు.

స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం తో పాటు సంగీత దర్శకత్వం కూడా వహించాడు. ఆ తర్వాత మళ్ళీ దర్శకత్వం జోలికి వెళ్ళలేదు. అధ్యాపక పాత్రలు ఎక్కువ గా చేసి ప్రేక్షకులను నవ్వించారు ధర్మ వరపు. అయితే ఆ పాత్రలను కించపరిచే విధంగా ఉండటంతో ఆ తర్వాత వాటికి దూరంగా ఉండాలి అనుకున్నాడు. ఒక్కడు సినిమా లోని పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలోని వాతావరణ వార్తలు చదివే పాత్ర, రెడీ సినిమాలో సంతోష్ రెడ్డి వంటి పాత్రలు ఆయనకు మంచి పేరు తీసుకు వచ్చాయి. ఆలస్యం అమృతం సినిమా ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: