టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కు ఎంతో మంచి పేరుంది. ఆయన తెరకెక్కించిన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని కూడా సూపర్ హిట్ సినిమాలే. ఆయన సినిమాల్లో ఎక్కువగా హీరో పాత్రలు డిఫరెంట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే మన హీరోలు అందరూ తప్పకుండా ఈ దర్శకుడితో ఓ సినిమా చేయాలని భావిస్తూ ఉంటారు. సినిమా ఫలితాలతో తేడాలు లేకుండా పూరి జగన్నాథ్ అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు.

ఆ విధంగా పూరి జగన్నాథ్ బాలకృష్ణ తో ఓ సినిమా చేయాలని ఎంతోమంది కోరగా పైసా వసూల్ రూపంలో ఆ కోరిక తీరింది. అయితే  ఈ సినిమా ఫలితం తేడా రావడంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా చేయాలని అభిమానులు డిమాం డ్ చేశారు. అయితే పైసా వసూల్ తర్వాత ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీ కావడం తో మళ్లీ సినిమా ఇంత వరకు పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ సినిమా తర్వాత బాలకృష్ణ సినిమా చేస్తాడనే వార్తలు వస్తూ ఉండగా రేపు పూరి జగన్నాథ్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజున తప్పకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని చెబుతున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాను పూర్తి చేయగా త్వరలోనే గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తూన్నాడు. ఆ సినిమా తర్వాత ఏ దర్శకుడుతో కూడా సినిమా ఒప్పుకోలేదు బాలయ్య. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ ఒప్పుకొ ని గోపీచంద్ మలినేని తో సహా షూటింగ్ చేయాలని భావిస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఇకపోతే లైగర్ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రేపు ఉండబోతోందని తెలుస్తోంది.టాలీవుడ్ సెన్సేషనల్  విజయ్ దేవరకొండ అభిమాను లు ఈ అప్డేట్ ను ఎలా స్వాగతీస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: