పెళ్లికి ముందుతో పోలిస్తే పెళ్లి తర్వాత సమంతకు ఆఫర్లు తగ్గాయని తెలుస్తుంది. నాగచైతన్యతో బంధం తెగిపోవడానికి సమంత సినిమాల్లో కొనసాగాలని తీసుకున్న నిర్ణయం కూడా ఒక కారణమనే కామెంట్లు వస్తున్నట్లు సమాచారం.
సమంత ఇప్పటికే కెరీర్ ను సరైన విధంగా ప్లాన్ చేసుకోవడానికి అడుగులు వేస్తున్నట్టు సమాచారం.. ఇతర పరిశ్రమల్లో కూడా సమంత రాణించాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తుంది. అయితే తెలుగులో వచ్చిన స్థాయిలో ఇతర భాషల్లో సమంతకు గుర్తింపు రాలేదని తెలుస్తుంది.మరోవైపు సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆసక్తి చూపినా ఆ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అవుతాయనే నమ్మకం కూడా లేదని తెలుస్తుంది.
సమంత ప్రస్తుతం కొందరు దర్శకులకు టచ్ లోకి వెళుతున్నారని సమాచారం. టాలివుడ్ లో కొత్త ప్రాజెక్టులు ఇప్పటికిప్పుడు ఓకే కావడం కష్టం అయినా సమంత కొత్త ఆఫర్ల కోసం తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. మరోవైపు శాకుంతలం ఫలితం పైనే సమంత కెరీర్ ఆధారపడి ఉంటుందని మెజారిటీ అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. శాకుంతలం విజయం సాధిస్తే ఒక విధంగా ఫ్లాప్ అయితే మరో విధంగా సమంత కెరీర్ ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నట్లు సమాచారం.
టాలీవుడ్ లో సమంతకు ఆఫర్లు రాకపోతే మాత్రం ఇతర ఇండస్ట్రీలలో కూడా సమంతకు కొత్త ఆఫర్లు రావడం కష్టమని తెలుస్తుంది. సమంతతో విడిపోయినట్టు చేసిన ప్రకటన వల్ల చైతన్య కెరీర్ కు మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే లేవని సమాచారం. సమంత కెరీర్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉందని తెలుస్తుంది.సినిమాల ద్వారా సమంత సుమారుగా 100 కోట్ల రూపాయలకు పైగా సంపాదించినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి