అయితే ఇలా సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ ఎంతో మంది సినీ నటులు స్పందిస్తూ ట్రోలర్స్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇకపోతే గత కొంత కాలం నుంచి నటి విద్యుల్లేఖ రామన్ పై తీవ్రస్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయ్. ఇప్పటికే నటి విద్యుల్లేఖ రామన్ కి పెళ్లి జరిగి పోయింది అనే విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల విద్యుల్లేఖ రామన్ మాల్దీవుల్లో విహరించేందుకు వెళ్ళింది. ఇక మాల్దీవులకు వెళ్లిన తర్వాత సాధారణంగా చాలామంది స్విమ్ సూట్ లో వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక్కడ విద్యుల్లేఖ రామన్ కూడా ఇదే చేసింది.
అయితే ఇక స్విమ్ సూట్ వేసుకున్న ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా సంచలనంగా మారిపోయింది. పెళ్లయిన తర్వాత స్వింసూట్ ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. విడాకులు తీసుకోబోతున్నారా అంటూ దారుణమైన ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇకపోతే తనపై వస్తున్న ట్రోల్స్ ఫై ఇటీవల నటి విద్యుల్లేఖ రామన్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను స్విమ్ సూట్ తో ఫోటో పోస్ట్ చేయగానే నీ విడాకులు ఎప్పుడు అని ఎంతోమంది సందేశాలు పంపుతున్నారు. స్విమ్ సూట్ ధరించినందుకేనా ఇదంతా చేస్తున్నారు. వావ్ మీరందరూ 1920 నుంచి 2021 కి వస్తే బాగుంటుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి