ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో జాతి రత్నాలు థియేటర్లో నవ్వులు పూయించారు. సరికొత్త కామెడీ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఇండియా తో పాటు అమెరికా లోనూ అలరించారు. కరోనా మహమ్మారి ఈ సమయంలో వచ్చినప్పటికీ జాతి రత్నాలను ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. దానికి కారణం సినిమాలో చిట్టి కూడా. చిట్టి నవ్వు కు జాతిరత్నాలు తో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆ సినిమా విడుదలైన సమయంలో చిట్టి పాత్రలో నటించిన హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా పేరు మారుమోగిపోయింది. ఇక చిట్టి సాంగ్ ఎంతగా ఆకట్టుకుందో అంటే... యూత్ అంతా తమ ప్రియురాలు చూసి ఇదే పాటను పాడుకునేలా చేసింది. నవీన్ పోలిశెట్టి కూడా ఈ పాట తోనే పడేశాడు. ఈ పాటను ఇటీవల కాలంలో పాపులర్ అయిన రామ్ మిరియాల ఆలపించాడు. ఈ పాపులర్ సింగర్ తన వాయిస్ తో చిట్టి పాటను మ్యాజిక్ చేశాడు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రధన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ ఏడాది హిట్ అనిపించుకున్న టాప్ టెన్ సాంగ్స్ లో చిట్టి సాంగ్ ఒకటి.

సినిమా విజయవంతం కావడానికి కారణం చిట్టి సాంగ్ కూడా కీలక పాత్రను పోషించింది. ఇక ఈ సాంగ్ తో ఫరియా అబ్దుల్లా క్రేజ్ , అందం మరింత పెరిగింది. ఆమె అభిమానులు ఈ సాంగ్ లో చిట్టి అందానికి ముగ్ధులైపోయారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే అంతలా ఆమె క్రేజ్ ను పెంచేసింది చిట్టి సాంగ్. ఇప్పటికి ఈ సాంగ్ ను ఎవరూ మర్చిపోలేదు. ఈ సాంగ్ లిరిక్స్ అన్ని వర్గాల వారికి అర్థమయ్యేలా సాధారణ లాంగ్వేజ్ లో ఉండడం. దానికే ఈ సాంగ్ ఇంతగా హిట్ అయ్యింది. సినిమా కూడా సాధారణ ప్రేక్షకుల మనుసును గెలుచుకుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: