గరుడవేగ సినిమా తో ఒక్కసారిగా మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు సీనియర్ హీరో రాజశేఖర్. మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆయన చేయగా ఆ సినిమాలు ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చాయి. కానీ ఆయన ఆ తర్వాత ట్రెండ్ కి తగ్గ సినిమాలు చేయకపోవడం ఆయన రేంజ్ కి తగ్గ సినిమాలు చేయకపోవడం వల్ల కెరీర్ లో బాగా వెనుకబడి పోయారు. ఆయనతో పాటు వచ్చిన హీరోలు చాలామంది స్టార్ స్టేటస్ ను అండుకోగా రాజశేఖర్ మాత్రం మినిమం హీరోగానే మిగిలిపోయాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో కలసి గరుడవేగ అనే సినిమా చేయగా అదృష్టం కొద్దీ అది సూపర్ హిట్ కావడంతో రాజశేఖర్ ఒక్కసారిగా పూర్వవైభవం తెచ్చుకున్నాడు అనేలా మారిపోయడు. అయితే ఈ సంబరం ఎన్నిరోజులు లేదు. ఈ సినిమా ఇచ్చిన హిట్ తో ఆయన తన తదుపరి సినిమాను కల్కి చేయగా ఆ సినిమా కూడా భారీ రేంజ్ లో విడుదల చేయగా అది బాక్సాఫీసు వద్ద చతికల పడింది. అత్యంత దారుణంగా ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఆ చిత్రం మునుపటి రాజశేఖర్ ను గుర్తు చేస్తూ మరొక భారీ ఫ్లాప్ ను తెచ్చిపెట్టింది. 

ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ సినిమా చేస్తే సూపర్ హిట్ సినిమాని చేయాలని చెప్పి చాలా రోజులు ఎన్నో కథలు విని చివరికి ఓ మలయాళం సినిమా రీమేక్ ను తెలుగులో చేయడం మొదలు పెట్టాడు. అదే సినిమాగా తెలుగులో తెరకెక్కిన సినిమా ఇప్పుడు ఈ సినిమా తెలుగులోకి సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది అన్న విషయం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే సంక్రాంతికి నాలుగు చిత్రాలు వస్తుండటంతో ఇప్పుడు ఈ సినిమాకు థియేటర్లు ఎట్లా చేయాలి అనే విషయంపై డిస్ట్రిబ్యూటర్లు కొంత గందరగోళం అవుతున్నారట. పెద్ద సినిమాల మధ్య వేరే సినిమాలేవి రావడానికి ముందుకు రాని నేపథ్యంలో రాజశేఖర్ ధైర్యంతో ముందుకు దిగుతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: