సంచలనాలు క్రియేట్ చేసిన ‘ఉప్పెన’ రిలీజ్ అయి 8 నెలలు దాటిపోయినా ఇప్పటి వరకు దర్శకుడు బుచ్చిబాబు మరొక సినిమాను ప్రారంభించలేకపోయాడు. ఇతడితో సినిమాలు తీయడానికి అనేక నిర్మాణ సంస్థలు క్యూ కట్టినప్పటికీ అతడి దృష్టి టాప్ హీరోల పై ఉండటంతో మరొక చిన్న సినిమా వైపు అతడి దృష్టి పడలేడు. ఆమధ్య దర్శకుడు బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాను తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.ఇలాంటి పరిస్థితులలో ఈ దర్శకుడు ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లేటెస్ట్ కథ గురించి చెప్పిన మాటలు అనేక సందేహాలకు తావు ఇస్తున్నాయి. తన వద్ద ఒక అద్భుతమైన కథ ఉందని ఈ కథ గురించి తాను కొన్ని నెలలుగా పనిచేస్తున్నానని చెపుతూ ఈ కథను ఒక ప్రముఖ హీరోకి వినిపించానని చెప్పాడు.


అంతేకాదు ఈ కథను నాలుగు వెర్షన్స్ గా వ్రాసానని ఆ వెర్షన్స్ లో ఆ హీరోకు ఏ కథ నచ్చితే ఆ స్క్రిప్ట్ సెట్స్ పైకి వెళుతుంది అంటూ లీకులు ఇచ్చాడు. దీనితో దర్శకుడు బుచ్చిబాబు మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడా అంటూ మళ్ళీ వార్తల హడావిడి మొదలైంది. అయితే జూనియర్ నటించవలసిన రెండు సినిమాలు ఇంకా లైన్ లో ఉన్నాయి.


కొరటాల శివ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వకుండా జూనియర్ దర్శకుడు బుచ్చిబాబు కల నెరవేర్చే పరిస్థితి లేదు. అయితే దర్శకుడు బుచ్చిబాబు మాత్రం తన సంచలనాత్మక కథ ఒక టాప్ హీరో వద్ద ఉంది అంటూ వ్యూహాత్మకంగా లీకులు ఇస్తున్నాడు. దీనితో దర్శకుడు బుచ్చిబాబు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడా లేకుంటే తన సినిమాలకు టాప్ హీరోల దగ్గర నుంచి కూడ ఆఫర్లు వస్తున్నాయి అని చెప్పే విధంగా ఇతడి తీరు ఉందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: