భారతదేశ సంగీతానికి వన్నె తెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. దేశంలోని ఎంతో మంది సంగీత విద్వాంసులకు సాధ్యం కాని గొప్ప ఘనత ను అయన సాధించాడు. సంగీత ప్రపంచంలో ఉత్తమ బహుమతిగా పేర్కొనబడే ఆస్కార్ అవార్డు ను అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహమాన్ రికార్డుల కెక్కాడు. చాలా చిన్న సినిమాల ద్వారానే అయన తన కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు ఇంతటి స్థాయికి ఎదిగాడు. తొలుత కీ బోర్డు ప్లేయర్ గా ఆయన తన కెరీర్ ను మొదలుపెట్టాడు.

కోటి, ఇళయరాజా వంటి పెద్ద పెద్ద సంగీత దర్శకుల వద్ద ఏళ్ల తరబడి అయన పనిచేశారు. అక్కడ తనకు కావాల్సిన సంగీత జ్ఞానాన్ని నేర్చుకుని పరిచయాలు సైతం పెంచుకున్నారు. రావడం రావడమే అయన కుంభ స్థలం కొట్టారని చెప్పొచు. అయన సంగీతం అందించిన తొలి సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు అయన సంగీతానికి మంచి పేరు తీసుకొచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో అయన సంగీతం అందించిన రోజా చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచి రెహమాన్ కు మంచి పేరు, గొప్ప విజయాన్ని అందించింది.

సినిమా విడుదల తర్వాత ఒక్కసారి గా రెహమాన్ కు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. అప్పటివరకు ఇళయరాజా సంగీతానికి అలవాటుపడి పోయిన ప్రేక్షకులు ఒక్కసారిగా రెహమాన్ సంగీతం కొత్త గా అనిపించడంతో ప్రేక్షకుల్లో కూడా ఆయనకు భారీ అభిమానం ఏర్పడింది. అలా ఏఆర్ రెహమాన్ తొలి సినిమా హిట్ తర్వాత ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆయనకు జయహో సినిమా కి గానూ ఆస్కార్ అవార్డు లభించింది. తెలుగులో అయన కొన్ని సినిమాలు చేసి డబ్బింగ్ సినిమాల ద్వారా ఎక్కువగా ప్రేక్షకులను అలరించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: