ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు ప్రాంతీయ సినిమాలతో అలరిస్తూనే, పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి ఇ చూపిస్తున్నారు. అయితే ఇలా ప్రాంతీయ సినిమాలతో చాలా బాగా అలరిస్తూ పాన్ ఇండియా సినిమాల పై కన్నువేసిన దర్శకులలో దిల్ రాజు కూడా ఒకరు. ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించి ఒక గొప్ప నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై కన్ను వేశారు. ప్రస్తుతం దిల్ రాజు, రామ్ చరణ్ హీరోగా ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆర్ సి 15 సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది, మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.

ఇలా ఇప్పటికే ఒక పాన్ ఇండియా సినిమా ను షూటింగ్ ను ప్రారంభించిన దిల్ రాజు కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించబోతున్నాడు, ఈ సినిమా కూడా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కబోతున్న తెలుస్తోంది, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది. ఇలా రెండు సినిమాలను ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్న దిల్ రాజు మరో అదిరిపోయే ప్రాజెక్టును కూడా లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా తెరకెక్కించబోతున్నట్లు అనేక రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి, అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: