మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యువఅధ్యక్షుడిగా మంచు విష్ణు సంస్కరణలకు శ్రీకారం చుడుతూనే ఎంతో ఆక్టివ్ గా ఉంటున్నారు. సినీ ఇండస్ట్రీ లో ఉండే ఆర్టిస్టుల కోసం ఇండ్ల నిర్మాణానికి రూపకల్పన లు చేస్తూనే , ఆర్టిస్టుల సంక్షేమానికి కూడా పలురకాల కార్యక్రమాలు చేపడుతున్నారు అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.. అంతేకాదు మా అసోసియేషన్ కోసం సొంత భవంతి నిర్మాణంపై ఆయన తన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం లోనే ఉన్నట్లు సమాచారం.


అంతేకాదు ఎవరైతే సినీ ఇండస్ట్రీలో కష్టంలో ఉన్నారని తెలిసిందో వారిని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ స్పందిస్తున్నారు.. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన శివ శంకర్ మాస్టర్ కరోనా  బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 70 శాతం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు ఆయన ఆరోగ్యం గురించి ఇప్పుడే ఎలాంటి భరోసా ఇవ్వలేమని చెబుతున్నారు.

ఇక ఈయన పెద్దకొడుకు అపస్మారక స్థితికి చేరగా, భార్య హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇకపోతే తాజాగా మా అధ్యక్షుడు విష్ణు,  శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడి కి ఫోన్ చేసి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు మాస్టర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసోసియేషన్ సభ్యులకు భరోసానిస్తూ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల తో ఆయన ఒప్పందం చేసుకున్నారట. ముఖ్యంగా ఆర్టిస్టులు ఎవరైనా అనారోగ్య సమస్యతో చికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తే కేవలం 50 శాతం తగ్గింపు తో ఆసుపత్రి ఓపి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.


ఆ ఆస్పిటల్ వివరాలకొస్తే అపోలో , ఏ ఐ జీ,  మెడికవర్ , కిమ్స్, సన్షైన్ వంటి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల తో ఒప్పందం కుదుర్చుకున్నారు. హాస్పిటల్ కి  వెళ్తే సుమారుగా 50 శాతం తగ్గింపు తో ఓపీ లో అత్యవసర ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవచ్చని విష్ణు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: