ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ చూపును ఆకర్షిస్తూ టామ్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది బిగ్ బాస్ కార్యక్రమం. ప్రస్తుతం తెలుగు బిగ్బాస్ కార్యక్రమం చివరి అంకానికి చేరుకుందని చెప్పాలి. ఇక బుల్లితెర ప్రేక్షకులందరి చూపు కూడా అటు బిగ్బాస్ కార్యక్రమము పైనే ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా టాప్ ఫైవ్ లో ఎవరు నిలవబోతున్నారు అని ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే దానిపై మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నో రోజులనుంచి అదృష్టం కారణంగా సేవ్ అవుతూ వస్తున్నా  కాజల్ లేదా ప్రియాంక వీరిలో ఎవరో ఒకరు ఇక ఈ వారం ఎలిమినేట్ అవుతారు అని అందరూ ఊహించారు.


వారిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం పక్కా అంటూ ఖచ్చితమైన అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ తో మాత్రం బిగ్బాస్ ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఎంతో ఫేమస్ సెలబ్రిటీ గా ఎంట్రీ ఇచ్చాడు యాంకర్ రవి. వచ్చినప్పటినుంచి  తనదైన ఆటలో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో రోజుల నుంచి నామినేట్ అవుతున్నప్పటికీ ఎలిమినేషన్ నుంచి మాత్రం బయటపడుతూ వస్తున్నాడు యాంకర్ రవి. ఇక యాంకర్ రవి టాప్ 5 లో తప్పకుండా ఉంటాడు అని అందరూ భావించారు.


 కానీ ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం రవి ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నాడు అనే వార్త మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. రవి ఎలిమినేట్ అవడం ఏంటి అది ఎలా సాధ్యమవుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగాకామెంట్లు పెడుతున్నారు ఎంతో మంది నెటిజన్లు. అయితే ఇటీవలే బిగ్ బాస్ ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు  ఇక ఈ ప్రోమో చూస్తూ ఉంటే రవి ఎలిమినేట్ అయింది నిజమేఅన్నది మాత్రం ప్రస్తుతం కన్ఫార్మ్ గా అయిపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే చివరిలో కాజల్ యాంకర్ రవి లు ఎలిమినేషన్ లో ఉండగా ఇక అటు సన్నీ ఎవిక్షన్ పాస్  ఉపయోగించాల్సి ఉంటుంది.  సన్ని పాస్ ఎవరికి ఉపయోగించారు అన్నది ప్రోమో చూపించక పోయినప్పటికీ తన స్నేహితురాలైన కాజల్ కోసమే ఎవిక్షన్ పాస్ సన్నీ ఉపయోగిస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. దీంతో ఎలిమినేట్ అయ్యాడు అంటూ వస్తున్న వార్త నిజమేనని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: