ఈ వారం థియేటర్ మరియు ఓటిటి లలో కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి, ఈ వారం థియేటర్ మరియు ఓటిటి లలో విడుదల కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి మనం ప్రస్తుతం తెలుసుకుందాం..

అఖండ : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మరక్కార్‌: అరేబియన్‌ సుమద్ర సింహం : మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మరక్కార్‌: అరేబియన్‌ సుమద్ర సింహం, ప్రియదర్శన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

బ్యాక్‌ డోర్‌ : పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బ్యాక్ డోర్,  కర్రి బాలాజీ తెరకెక్కించిన ఈ మూవీ ని బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించారు, బ్యాక్ డోర్ సినిమా డిసెంబర్ మూడవ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

స్కైలాబ్‌ : సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా స్కైలాబ్, విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ ని పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు, ఈ సినిమా డిసెంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.
 
ఈ వారం ఓటిటి లలో విడుదల కాబోయే సినిమాలు తెలుగులో

నెట్‌ఫ్లిక్స్‌ :
ద పవర్‌ ఆఫ్ ది డాగ్‌ (హాలీవుడ్‌) - డిసెంబర్‌ 1.
లాస్‌ ఇన్‌ స్పేస్‌ (వెబ్‌ సిరీస్‌) - డిసెంబర్‌ 1.
కోబాల్ట్‌ బ్లూ (హాలీవుడ్‌) - డిసెంబర్‌ 3.

ఆహా :
మంచి రోజులు వచ్చాయి (తెలుగు) - డిసెంబర్‌ 3.

అమెజాన్‌ ప్రైమ్‌ :
ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ (హిందీ వెబ్‌సిరీస్‌) - డిసెంబర్‌ 3.

జీ5:
బాబ్‌ విశ్వాస్‌(హిందీ) - డిసెంబర్‌ 3.

బుక్‌ మై షో :
ఎఫ్‌9 (తెలుగు) - డిసెంబర్‌ 1.

మరింత సమాచారం తెలుసుకోండి: