సమంత నాగచైతన్య విడాకులు అటు టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురి చేశాయి. అయితే వీరు విడాకులు తీసుకుంటున్నారు అని ప్రకటించక ముందు నుంచే విడాకుల గురించి వార్తలు వచ్చాయి. కానీ కేవలం పుకార్లు మాత్రమే అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిజంగానే విడాకులు తీసుకున్నట్లు సమంత నాగచైతన్య సోషల్ మీడియాలో ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మందిని ప్రేమాభిమానాలు సంపాదించుకున్న ఈ అక్కినేని దంపతులు అసలు విడిపోవడానికి కారణం ఏమిటి అన్నది ఇప్పటికీ ప్రేక్షకులకు ఒక చిక్కుముడి ఇలాంటి ప్రశ్న గా మారిపోయింది.



 అయితే  సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల విషయమై స్పందించింది. తాను విడాకుల తర్వాత చనిపోతా అని అనుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సమంతా. అయితే విడాకుల తర్వాత ఇప్పటివరకు నాగచైతన్య మాత్రం ఒక్కసారి కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ కి హాజరైన నాగచైతన్య  చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్. అయితే నేరుగా సమంత పేరు తీయకపోయినప్పటికీ.. నాగచైతన్య మాత్రం ఇండైరెక్ట్గా సమంత కు కౌంటర్ ఇచ్చాడు అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.



 ఇంతకీ నాగచైతన్య ఏమన్నాడంటే.. మీరు మీ కెరీర్ లో ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు అంటూ ప్రశ్నించగా... అన్ని రకాల పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అయితే నేను పోషించే పాత్ర, సినిమా కూడా నా కుటుంబం పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించకూడదు అని భావిస్తూ ఉంటాను. ఇక నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే విధంగా నా కెరీర్లో నేను ఏ పాత్ర చేయను అంటూ నాగచైతన్య వ్యాఖ్యానించాడు.  ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.. అయితే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ పాత్ర విడాకులకు ప్రధాన కారణమని రూమర్స్ కి ఇక ఇప్పుడు చైతన్య చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: