వచ్చే ఏడాది కి ఇప్పటికే కంప్లీట్ చేసిన సినిమాలను తక్కువ వ్యవధి లోనే విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఏదేమైనా ఒకప్పటిలా ఒక సినిమా పూర్తయి న తర్వాతనే మరొక సినిమాను ఒప్పుకోకుండా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు మూడు సినిమాలను ఒప్పుకుని వాటిని అతి తక్కువ కాలంలోనే విడుదల చేసే విధంగా ప్రభాస్ ప్రణాళికలు చేసుకోవడం ఇప్పుడు ఆయన అభిమానులను ఎంతో ఆనంద పరుస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలను మొదలు పెట్టిన తర్వాతనే ప్రభాస్ లో ఈ ప్రవర్తన మొదలైంది.
అయితే రాధే శ్యామ్ విషయంలో సినిమా అంతగా బాగుండదని కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా ఈ సినిమా బాగుండదు అనే విషయంలో ఎంతో కొంత నిజమైతే ఉండే ఉంటుంది. ఈ నేపథ్యంలో కథ విషయంలో ప్రభాస్ ఏ మాత్రం ఆలోచించకుండా సినిమాలను ఒప్పుకుంటే మాత్రం అది మొదటికే మోసం అవుతుందని కొంతమంది అభిమానులు సలహా ఇస్తున్నారు. ఇప్పటికే సాహో సినిమా విషయంలో ప్రభాస్ అంచనాలు చతికిల పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈసారి కనుక మంచి కథ తో ముందుకు పొక పోతే పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ కెరియర్ పడిపోయే ప్రమాదం ఉందని వారు వెల్లడిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి