నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక సినిమాను నిర్మించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.  ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, ఒక పాత్రలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నట్లు, మరొక పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది, ఫ్యాక్షనిస్ట్ పాత్రలు, పోలీస్ పాత్రలు బాలకృష్ణ కు పెద్ద కొత్తేమీ కాదు. ఇది వరకే ఎన్నో సినిమాల్లో ఇలాంటి పాత్రలు చేసి బాలకృష్ణ ప్రేక్షకులను మెప్పించాడు, ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ నెగిటివ్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్ కనబడనున్నట్లు తెలుస్తోంది, ఈమె పాత్ర చాలా పవర్ఫుల్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.  

ఇది వరకే గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన క్రాక్ సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ కీ గోపీచంద్ మలినేని అదిరిపోయే పవర్ఫుల్ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు, ట్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది, ఇది వరకు ఈ సినిమా కు జై బాలయ్య అనే టైటిల్ ను చిత్ర బృందం అనుకుంటున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. అయితే  ప్రస్తుతం ఈ సినిమా కు వేటపాలెం అనే టైటిల్ ను చిత్ర బృందం ఈ  సినిమా కోసం పరిశీలిస్తున్నట్టు మరొక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది, ఈ వార్తపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: