ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధర తగ్గింపు వివాదం కాస్త అంతకంతకూ ముదురు తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఈ వివాదం లోకి వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇవ్వడం తో ఈ వివాదం మరో లెవల్ కు చేరి పోయింది. ఇటీవలే టికెట్ల ధరలు తగ్గించడం పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడుతూ వీడియో విడుదల చేయడం తో సంచలనంగా మారిపోయింది అనే చెప్పాలి.


 ఇటీవలే  యూట్యూబ్ లో ఏకంగా 10 ప్రశ్నలను సంధిస్తూ ఏపీ ప్రభుత్వానికి సవాల్ చేస్తూ ఒక వీడియోని వదిలారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ప్రభుత్వమే తక్కువ ధరకు సినిమా తీయొచ్చు కదా అంటూ సెటైర్ వేసిన వర్మ ప్రభుత్వం అమలు చేస్తే సంక్షేమ పథకాల మాదిరిగానే రేషన్ థియేటర్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు కదా సలహా ఇచ్చారు. ఇలా పది ప్రశ్నలతో వర్మ విడుదల చేసిన  వీడియో కాల్ తో సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. అంతేకాకుండా ఇక వర్మ  ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వరుస ట్వీట్లు కూడా దుమారం రేపుతున్నాయి.


 అయితే వర్మ చేసిన వ్యాఖ్యలకు ఎప్పుడూ విరుద్ధం  గా కామెంట్ చేసే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు మాత్రం పాజిటివ్ గా స్పందించారు. సినిమా టికెట్ల ధరల అంశంపై ఏపీ ప్రభుత్వానికి రామ్ గోపాల్ వర్మ  సంధించిన ప్రశ్నలు అన్ని నిజమే అంటూ అటు నాగబాబు వ్యాఖ్యానించారు. తన నోటి నుంచి వచ్చే ప్రశ్నలను రాంగోపాల్ వర్మ బయటపెట్టారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక నాగబాబు పోస్ట్ పై స్పందించిన రాంగోపాల్ వర్మ మీలాగే మరి కొంతమంది ఈ విషయంపై స్పందించాలి అంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: