యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పనులన్నింటినీ పూర్తి చేసుకున్నాడు,  ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా ప్రమోషన్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొన్నాడు, ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు, అయితే ఈ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు, ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు,  అయితే ఇలా ఆర్ఆర్ఆర్ సినిమా పనులన్నీ ముగియడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది,  ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది అంటూ కొన్ని రోజుల క్రితం నుండి అనేక వార్తలు వస్తున్నాయి,  అయితే ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కావడం కష్టమే అని తెలుస్తుంది.

  దానికి ప్రధాన కారణం ప్రస్తుతం కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉండటం,  అలాగే దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరగడంతో ఈ సినిమా ప్రారంభం కావడానికి మరికొంతకాలం పట్టే  అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇలా దర్శకుడు కొరటాల శివ కు ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందు కాస్త సమయం దొరకడం తో ఈ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు అనిరుద్ ను సంగీతదర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచనలో  కొరటాల శివ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: