సౌత్ క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫోన్ నెంబర్ ఓ చిన్న పొరపాటు వల్ల లీక్ అయ్యింది. సెలబ్రిటీల ఫోన్ నెంబర్ ల కోసం ఫ్యాన్స్ ఎంత ఎక్సయిటింగ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. ఒక్కసారిగా కాజల్ ఫోన్ నెంబర్ అనేసరికి సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. కాజల్ అగర్వాల్ తన ఫ్రెండ్ తో చేసిన వీడియో కాల్ ని స్క్రీన్ షాట్ తీసి తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో షేర్ చేసింది. అయితే అందులో తన నెంబర్ తో పాటు కాజల్ మాట్లాడిన ఫ్రెండ్ ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి. ఆ రెండు నెంబర్లని ట్రూ కాలర్ లో కొట్టి చూస్తే అందులో ఒకటి కాజల్ నెంబర్ అని తేలింది. కాజల్ చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు ఆమె నెంబర్ అందరికి లీక్ అయ్యింది.

కాజల్ అగర్వాల్ నెంబర్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. గౌతం తో పెళ్లి తర్వాత చిన్నగా సినిమాలను దూరం పెడుతూ వస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు చెప్పారు. తనకు పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటున్న కాజల్ కి ఈ ఫోన్ నెంబర్ లీక్ పెద్ద తలనొప్పి తెచ్చేలా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండటం కూడా కొన్నిసార్లు ఇలాంటి చిక్కులని తెచిపెడతాయి. తను షేర్ చేసిన స్క్రీన్ షాట్ లో ఫోన్ నెంబర్లు ఉన్నాయని కాజల్ ఆ పోస్ట్ డిలీట్ చేసినా సరే అప్పటికే ఆమెని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారు ఆ స్క్రీన్ షాట్ ని డౌన్ లోడ్ చేసుకున్నారు.

మొత్తానికి కాజల్ అగర్వాల్ నెంబర్ అలా లీక్ అయ్యింది. అయితే సెలబ్రిటీ నెంబర్ కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. కాజల్ ఇదివరకు స్టార్ హీరోయిన్ కానీ ఇప్పుడు ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ భార్య. కాబట్టి కాజల్ ఫోన్ నెంబర్ ఇదే కదా అని చెక్ చేసేందుకో.. లేక పోకిరి వేషాలు వేసేందుకో నెంబర్ కి మెసేజ్ చేయడం.. లేదా కాల్స్ చేయడం  చేస్తే మాత్రం తర్వాత సీన్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: