అమల అక్కినేని ఈ పేరు వింటే అందరు ఎంతో గౌరవంతో పలకరిస్తారు. అందరికీ ఆమంటే అంత గౌరవం, ప్రేమ. అందరితోనూ కలివిడిగా కలిసిపోయి వినయంగా కనిపించడమే కాదు అంతే వినయంగా జీవితంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈమె అక్కినేని నాగార్జునతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరు ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే చాలా మంది అమల ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చారు అని అంతా అనుకుంటుంటారు. అంతేకాదు ఈమె నాగ్ కి రెండో పెళ్లి అయినా పర్వాలేదు అనుకున్నారు అని  పెళ్లి తర్వాత అత్తింటి వారు ఎలాంటి కండిషన్స్ పెట్టినా సరే అని సినిమాలకు దూరం అయ్యారు అని చాలామంది అనుకుంటారు.

అయితే నిజానికి వాస్తవం ఏఇంటంటే, ప్రేమించిన వ్యక్తి కోసం తనని తాను చాలా మార్చుకున్నారు అమల. అతని కోసమే జీవితం అన్నట్లుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకపోయినా తన భర్తకు, కుటుంబానికి నచ్చిన విధంగా డెసిషన్స్ తీసుకున్నారని వారి సన్నిహితులు, బందువులు చెబుతుంటారు. అసలు అమల గారి బ్యాగ్రౌండ్ ఏమిటో ఒకసారి తెలుసుకుందాం పదండి.

అమల గారి జన్మ స్థలం కోల్ కత్తా ఈమె 1967 సెప్టెంబర్ 12 న జన్మించారు. తండ్రి భారతీయుడు కాగా తల్లి మాత్రం ఐరిష్ దేశానికి చెందిన వారు. భరతనాట్యంలో కళాప్రపూర్ణరాలు అమల. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి కీర్తిప్రతిష్టలను పొందారు. అలా ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే టీ రాజేందర్ డైరెక్షన్ లో ఓ సినిమా అవకాశం వచ్చింది. అలా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అమల 50 కి పైగా సినిమాల్లో నటించారు. ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరోయిన్ గా మన్నలను పొందారు. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయం లోనే నాగ్ ఆమెకి ప్రపోజ్ చేయడంతో నాగ్ అంటే మంచి అభిప్రాయం ఉన్న అమల ఆయన ప్రేమను అంగీకరించి 1992 లో వివాహం చేసుకున్నారు.

అప్పటికే నాగ్ తన మొదటి భార్యతో విడిపోయి ఉన్నారు. దాంతో ఇబ్బందులు ఏమి తలెత్తలేదు. పెళ్లయ్యాక బాగా ఆలోచించి  తానే స్వయంగా ఇక సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని నాగ్ కి చెప్పడంతో సంతోషంగా ఒప్పుకున్నారు నాగ్. అలా సినిమాలకు దూరమయ్యారు అమల. జంతువులు అంటే ఆమెకు పంచ ప్రాణాలు...మూగ జీవాల సంరక్షణలో, సామాజిక సేవలో ఎపుడు ముందుంటారు. పెళ్లికి ముందే ఈమెకు తల్లి తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు, అలాగే నాట్య ప్రదర్శనల ద్వారా, సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. అయినప్పటికీ ఎపుడు గర్వం ఆమె కళ్ళలో కానీ నడవడికలో కానీ కనిపించదు. అంత పెద్ద ఇంటికి కోడలు అయినా చాలా సాదాసీదాగా ఉంటారు అమల అక్కినేని.


మరింత సమాచారం తెలుసుకోండి: