తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన సినీ జీవితంలోనే ఒక విభిన్నమైన కథతో సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని చూసిన వారంతా బన్నీని ప్రశంసించారు. అయితే పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తరువాత హైలెట్ అయినా పాత్ర కేశవ. ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాలో స్క్రీన్‌పై కూడా అల్లు అర్జున్ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు కేశవ. అయితే కేశవ పాత్రలో నటించిన వ్యక్తి అసలు పేరు.. జగదీష్. ఆయన చిత్ర పరిశ్రమలో నాలుగేళ్లుగా పడుతున్న కష్టానికి దక్కిన ఫలితం కేశవ పాత్ర అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో కేశవ పాత్ర కోసం ఎంతో మందిని అనుకున్నారట. అలా సంప్రదించిన వారిలో మహేష్ విట్టా కూడా దాదాపుగా సెలెక్ట్ అయ్యాడనే వార్తలు బాగా వినపడ్డాయి. అయితే మహేష్ విట్టా కూడా ఆ పాత్ర కోసం ఆడిషన్‌కు వెళ్లినట్టు సమాచారం.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేశవ పాత్ర కోసం తనతో పాటు ఎంతోమంది ఆడిషన్‌కి వచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో కొన్ని సీన్లను తనకి చెప్పినట్లుగా తెలిపారు. అంతేకాదు.. తనకు కూడా నచ్చడంతో అంతా ఓకే అనుకున్నామని వెల్లడించారు. అయితే చివరికి తనను పిలవకుండా వేరొక అబ్బాయిని తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఇక అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. ఈ సినిమాకి 2 సంవత్సరాల టైం కేటాయిస్తారో లేదో అని ఆలోచించినట్లుగా వారు అనుకున్నారని తన స్నేహితులు తెలియజేశారని మహేష్ చెప్పుకొచ్చాడు. కాగా.. మహేష్ కి తెరపై కేశవ పాత్రను చూసి చాలా సంతోషం అనిపించింది.. తనకు కథ ఎలా చెప్పారో అలాగే తీశారని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: