కొంతమంది హీరోలు ఎన్ని మంచి సినిమాలు చేసినా కూడా వారికి భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం అనేది జరగదు. ఇతర హీరోలు చేసిన కొన్ని సినిమాలతోనే భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి 100 కోట్ల హీరోగా మారిపోతుంటే ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా భారీ స్థాయిలో సపోర్టు ఉండి మంచి దర్శకులతో సినిమాలు చేస్తున్న కూడా అక్కినేని వారసులు మాత్రం ఈ వంద కోట్ల క్లబ్ లోకి మాత్రం చేరలేకపోతున్నారని చెప్పవచ్చు.  అక్కినేని నాగార్జున కూడా ఈ క్లబ్ లో చేరకపోవడం వారి అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది.

అక్కినేని నాగార్జున వయసు అయిపోవడంతో ఆ తరహాలో ఆ రేంజ్ లో సినిమాలు చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన వారసులుగా వచ్చిన నాగచైతన్య మరియు అఖిల్ అయిన ఈ తరహాలో సినిమా చేస్తారు అని అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ వారికి విజయం దక్కడం కూడా గగనమైపోయిన ఈ రోజుల్లో వంద కోట్ల కలెక్షన్లు అంటే ఎంతో కష్టపడాలి అని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. అక్కినేని నాగచైతన్య అయితే పర్వాలేదు కానీ అఖిల్ కు ఏమాత్రం కలిసి రావడం లేదనే చెప్పాలి.

ఆయన హీరోగా మూడు సినిమాల్లో నటించిన తర్వాత తొలి సక్సెస్ ను అందుకున్నాడు. 4వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  తో ఘన విజయం అందుకున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఏజెంట్ సినిమాతోనైనా భారీ స్థాయిలో కలెక్షన్లను అందుకుటాడా అనేది చూడాలి. తాజాగా బంగార్రాజు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈ చిత్రం కుండా 100 కోట్ల క్లబ్ లోకి వెళుతుందని అందరూ భావించారు. కానీ ఏపీలో టికెట్ల వ్యవహారం, కరోనా కారణంగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరలేకపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: