బుల్లితెర టాప్ రియాలిటీ షో గా పేరుగాంచిన 'బిగ్ బాస్' షో ద్వారా చాలా మంది సెలబ్రిటీలు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇటీవలే ఈ షో 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 5 లో లేడీ అర్జున్ రెడ్డి గా ఆడియన్స్ లో మంచి గుర్తింపు పొందింది హాట్ బ్యూటీ లహరి షారి. బిగ్ బాస్ కంటే ముందు కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు  అయితే బిగ్ బాస్ షో తో మాత్రం ఈమెకు ఫాలోయింగ్ పెరిగింది. ఇక బిగ్ బాస్ అనంతరం లహరి సినిమా ఆఫర్లను అందుకుంటూ బిజీబిజీగా మారిపోయింది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా ఓ లగ్జరీ బైక్ ను కొనుగోలు చేసింది. 

వీటికి సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. లహరి ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. 'మొత్తానికి బైక్ కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా బైక్ సౌండ్ నాకు చాలా నచ్చింది' అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ బైక్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక లహరి కొత్త బైక్ కొనడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ అని మాస్టర్ సహా పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆమెకు సోషల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ చెబుతూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ లగ్జరీ బైక్ bmw G 310 GS మోడల్ కి చెందినదిగా తెలుస్తోంది. అంతేకాదు ఈ బైక్ ధర సుమారు 3 నుంచి 3.5 లక్షలుగా ఉంటుందని సమాచారం.

 ఇక లహరి కి ఇది ఇష్టమైన బైక్ అని తెలుస్తోంది. గతంలోనే ఈ బైక్ ను ఆమె తీసుకోవాలని ప్రయత్నించినా వీలు కాలేదట. అయితే ఇప్పుడు బిగ్ బాస్ తో వచ్చిన గుర్తింపు వల్ల ఆమెకు సినిమాల్లో ఆఫర్లు రావడంతో తాజాగా తనకు నచ్చిన బైక్ కొని తన ఆనందాన్ని ఇలా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ఇటీవలే ఈమె కి ఓ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: