దర్శకుడు మేర్లపాక గాంధీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ భారీ స్థాయిలో హిట్ అయ్యి ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకు వచ్చింది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కి ఓ స్టార్ హీరోయిన్ అందించిన దర్శకుడిగా కూడా ఆయన మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. అంతేకాదు హిట్ లు లేక సతమతమవుతున్న హీరో సందీప్ కిషన్ కు కూడా ఆయన మంచి హిట్ ఇచ్చి ఆయన కెరీర్ నిలబడేలా చేశాడు. అలా మేర్లపాక గాంధీ చేసిన తొలి సినిమాతోనే ఎన్నో ఘనతలు అందుకొని విశేషమైన దర్శకుల వరుసలో మొదటగా నిలబడ్డాడు.

ఇక ఈ సినిమా సాధించిన విజయం ఆయనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది అని చెప్పవచ్చు. తొలి ప్రయత్నమే మొదటి స్థాయిలో ఆదరణ తగ్గడంతో ఆయన తన తదుపరి సినిమా పెద్ద హీరోతో చేయడం విశేషం. నానితో కలిసి కృష్ణార్జున అనే సినిమా చేశాడు మేర్లపాక గాంధీ. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం లో చూపించి ఆయన అభిమానులను ఎంతగానో అలరించాడు. అంతే కాదు ఆ సినిమా కూడా బాగానే ప్రేక్షకులను మెప్పించడం తో దర్శకుడిగా రెండు సినిమాలతోనే అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. అలా ఆయన స్టార్ హీరోతో సినిమా చేసే విధంగా అడుగులు వేశాడు.

ఆ విధంగా రామ్ చరణ్ తో ఆయన సినిమా చేయాలని భావించి కొన్ని ప్రయత్నాలు చేయగా అది ఎందుకో విఫలం అయ్యింది. కథ విషయంలో చరణ్ మెప్పించలేకపోయిన గాంధీ ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకుని నితిన్ తో కలిసి ఓ రీమేక్ సినిమా చేశాడు. అలా మ్యాస్త్రో సినిమా చేసిన ఆయన ఆ చిత్రాన్ని  ఓ టీ టీ లో విడుదల చేయడం విశేషం.  ఈ చిత్రానికి కూడా భారీ స్థాయిలో స్పందన దక్కింది. రీమేక్ సినిమానే అయినా ఒరిజినల్ కి ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా ప్రేక్షకులకు ఆ చిత్రన్ని చూసే విధంగా గా దాన్ని మలిచాడు. అలా మేర్లపాక గాంధీ తన తదుపరి సినిమాకు చాలా సమయం తీసుకోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మంచి విజయాలు ఉన్నా కూడా ఆయన తన తదుపరి సినిమా ఎందుకు లేట్ చేస్తున్నాడు అనే అనుమానాలు అందరికీ కలుగుతున్న వేల ఇప్పుడు సంతోష్ శోభన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు అనే వార్తలు బయటకు రావడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: