టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటి జయవాణి అందరికీ సుపరిచితురాలు. ఇటీవల ఆమె ఒక ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఆమె తన గురించి, హీరోయిన్ రమ్యకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సాధారణంగా ఇండస్ట్రీలో రాణించాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఆ స్ట్రగుల్స్ ను ఎదుర్కొన్నప్పుడే ఇండస్ట్రీలో రాణించగలమని నటి జయవాణి పేర్కొన్నారు. సినిమాలో నటించే ఆర్టిస్టులకు అవకాశాలు చాలా తక్కువ. బాగా పాపులారిటీ ఉంటే తప్ప.. నిర్మాతలు, డైరెక్టర్లు కాంటాక్ట్ అవ్వరు. సినీ రంగంలో ఒక సినిమా పూర్తయితే ఆర్టిస్టులు, నటీనటులు వేరొక సినిమా కోసం వెతుక్కోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.


సినీ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు వస్తే.. ప్రపంచ స్థాయిలో నటీనటులకు పేరు వస్తుందని జయవాణి పేర్కొన్నారు. ఇండస్ట్రీలోని స్ట్రగుల్స్ ని నిలదొక్కుకున్న వారే సినీ రంగంలో రాణిస్తారని ఆమె తెలిపారు. తనతోపాటు చాలా మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారని పేర్కొన్నారు. తనతో కలిసి నటించిన చాలా మంది ప్రస్తుతం ఇండస్ట్రీలో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హార్డ్ వర్క్ చేసి ఉంటే ఇంకా మంచి పొజిషన్‌లో ఉండేదానినని జయవాణి తెలిపారు. ఇప్పటివరకు తను నటించిన పాత్రల్లో తనకు ఒకే ఒక్క పాత్ర బాగా నచ్చిందని ఆమె పేర్కొన్నారు.  


మొదటి సారిగా తమ్మారెడ్డి సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యానని జయవాణి తెలిపారు. ఇండస్ట్రీలో ఎవరూ తెలియకపోయినా.. అవకాశాలు మాత్రం వచ్చాయని పేర్కొన్నారు. హీరోయిన్‌గా రాణించలేదనే బాధ మాత్రం ఎక్కువగా ఉందన్నారు. అయితే ఒక టాప్ డైరెక్టర్ సినిమాలో క్యారెక్టర్ కోసమని ఫోటో షూట్‌కి పిలిచాడని పేర్కొన్నారు. తీరా ఫోటో షూట్‌కు వెళ్లినప్పుడు లంబాడి టైప్ డ్రెస్సులతో ఫోటో తీశారని జయవాణి తెలిపారు. అయితే తనకు ఇప్పటికీ ఆ ఫోటోలు ఏం చేశారనే విషయమే తెలియదన్నారు. అయితే చాలా మంది.. తనపై ఆరోపిస్తుంటారని, కెమెరా ముందు ఎంతో రెచ్చిపోతుంటారని అంటుంటారు. వాస్తవానికి అది నిజం కాదన్నారు. అయితే నటి రమ్యకృష్ణ కూడా ఎంతో మంచి వ్యక్తి అని అన్నారు. కెమెరా ముందు ఎలా ఉంటారో.. రియల్ లైఫ్‌లోనూ అలానే ఉంటారు. రమ్యకృష్ణ చాలా సాఫ్ట్ అని జయవాణి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: