సినీ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్ అయ్యాయి. చాలా మంది హీరో-హీరోయిన్లు, డైరెక్టర్లు-హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం చూస్తుంటాము. ప్రేమలో నిండా మునిగి.. చివరకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతుంటారు. ఈ రోజు మనం సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లతో ప్రేమలో పడి.. వారిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.మణిరత్నం-సుహాసిని..

డైరెక్టర్ మణిరత్నం అందరికీ సుపరిచితులు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తున్న సుహాసిని దర్శకుడు మణిరత్నంను ప్రేమించింది. కొద్ది రోజులపాటు వీరి ప్రేమాయణం కొనసాగింది. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా, సుహాసిని ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు.  సెల్వమని-రోజా..

హీరోయిన్‌గా రోజా.. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా, జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే రోజా 2002లో తమిళ దర్శకుడు సెల్వమనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే దర్శకుడు సెల్వమని 15 సినిమాలు చేయగా.. అందులో 11 వరకు సినిమాల్లో రోజా హీరోయిన్‌గా నటించారు.


కృష్ణవంశీ-రమ్యకృష్ణ..

నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుబలి సినిమాలో శివగామిగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో 100కు పైగా సినిమాలో నటించారు. అయితే రమ్యకృష్ణకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘చంద్రలేఖ’. ఈ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చేశారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. 2003లో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కాగా, కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు.  ప్రతాప్ పోతేని-రాధిక..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రాధిక.. తమిళ ఇండస్ట్రీలోనూ రాణించారు. తమిళ డైరెక్టర్ ప్రతాప్ పోతేనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే ప్రతాప్ పోతేనితో కలిసి పలు సినిమాల్లో నటించిన ఆమె.. అతడి ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరు వివాహం కూడా చేసుకున్నారు. అయితే పెళ్లయిన మూడేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. దీంతో వీరు విడిపోయారు. ఆ తర్వాత రాధిక హీరో శరత్ కుమార్ ప్రేమలో మరోసారి పెళ్లి చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: