ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అటు తన జనసేన పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తూ కొనసాగుతున్నారు. ఇక లేటెస్ట్ గా అయన నటించిన భీమ్లా నాయక్ సినిమా, ఈ నెల 25న లేదా ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మన దేశంలోని కరోనా పరిస్థితులు ఈ నెలాఖరు నాటికి సర్దుకుంటే పక్కాగా ఈనెలాఖరులో భీమ్లా రిలీజ్ ఖాయం అంటోంది యూనిట్. మరోవైపు ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఉన్నాయి.
దగ్గుబాటి రానా ఒక కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీని సాగర్ కె చంద్ర తీస్తుండగా త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నారు. మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం కి రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీలో సంయుక్త మీనన్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక దీనితో పాటు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే భారీ సినిమా కూడా చేస్తున్నారు పవన్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే, రెండు రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన మేనల్లుళ్లయిన సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ లతో రెండు సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యారని, అలానే ఆయా సినిమాల డైరెక్టర్స్ కి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాక్.

అయితే వీటిలో ఇటీవల కోలీవుడ్ లో రూపొంది సముద్రఖని ప్రధాన పాత్ర చేసిన వినోదయ సితం మూవీ రీమేక్ ఒకటని టాక్. దీనిని తెలుగులో కూడా సముద్రఖని తీయనున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలకి సంబంధించి త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్స్ రానున్నాయని, ఈ విధంగా తొలిసారిగా తన కెరీర్ లో ఇద్దరు మేనల్లుళ్లతో పవర్ స్టార్ సినిమాలు చేస్తున్నారని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: