ఇప్పుడు మరో హీరోయిన్ ఓపెన్ అయ్యింది. నేను కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నాను అంటూ హీరోయిన్ ఎరికా ఫెర్నాండెజ్ చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది. అప్పట్లో సౌత్లో హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉంటేనే ఇష్టపడేవారు. నేను సన్నగా ఉండే దాన్ని ఈ సమయంలో ఇక నా శరీరంపై ప్యాడ్స్ పెట్టి మేనేజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నించేవారు. ఇక వాళ్లు ఇలా ప్యాడ్స్ పెట్టడం చూసి నాకు ఎంతో సిగ్గుగా అవమానంగా అనిపించింది. అంతేకాకుండా ప్యాడ్స్ పెట్టుకొని నటించడానికి అసౌకర్యంగా కూడా ఫీలయ్యే దాన్ని.. ఇక వాళ్ళు కోరుకున్నట్లు నేను ఎందుకు లేను అని చాలాసార్లు బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం పరిస్థితులు మారాయని హీరోయిన్ ఎలా ఉన్నా ప్రతిభ ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. కాగా టాలీవుడ్లో గాలిపటం అనే సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది ఎరికా ఫెర్నాండెజ్. కానీ ఆ తర్వాత మాత్రం అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ ప్రస్తుతం తమిళ కన్నడ పరిశ్రమలో మాత్రం వరస అవకాశాలు అందుకుంటోంది.. ఏదేమైనా ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి