మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన 'క్రాక్' సినిమా తర్వాత మంచి ఊపు మీద ఉన్నాడు.  అయితే క్రాక్‌కు ముందు విడుదలైన రవితేజ చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేపోయాయి. క్రాక్ సినిమా మాస్ మహారాజా రవితేజ కు మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం మాస్ మహారాజా ఇదే ఫామ్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడట. అయితే తాజాగా ఈ క్రమంలో ఖిలాడి విడుదల న్యూస్..బయటకొచ్చింది.రవితేజ అప్‌కమింగ్ మూవీ 'ఖిలాడి' ఫిబ్రవరి 11న విడుదల ఖరారు చేసుకుంది. ఇక రవితేజ అభిమానులకు తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేస్తే అది ఒక పండగలా ఉంటుంది.

అయితే ఖిలాడి విడుదల తేదీ చూస్తే మాత్రం.. రవితేజ ఫ్యాన్స్ కాస్త ఖంగారు పడుతున్నారు.  ఇక మాస్ మహారాజా కెరియర్లో ఫిబ్రవరిలో తన సినిమా రిలీజ్ అయి మంచి హిట్ కొట్టిన చరిత్ర లేదు. అయితే గతంలో 2006లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన 'షాక్' సినిమా ఫిబ్రవరి నెలలోనే విడుదలయ్యింది. కానీ ఈ సినిమా కమర్షియల్‌గా అంత సక్సెస్ సాధించలేకపోయింది. అంతేకాకుండా 2012లో 'నిప్పు', 2018లో 'టచ్ చేసి చూడు' సినిమాలు కూడా ఫిబ్రవరిలోనే విడుదల కావడం జరిగింది ఇక ఈ సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

అయితే ప్రస్తుతం ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఖిలాడి కూడా ఫిబ్రవరిలోనే విడుదవుతుండటం మాస్ మహారాజ్ ఫ్యాన్స్‌ను ఖంగారు పెడుతోంది.  అయితే మాస్ మహారాజా అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు గతంలోని సినిమాలలాగా సెంటిమెంట్‌తో ఖిలాడి కూడా కమర్షియల్‌గా వెనకబడుతుందో లేదా ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి.ఇక తాజాగా ఖిలాడి ట్రైలర్ విడుదల మంచి రెస్పాన్స్ ని కనబరుస్తోంది ట్రైలర్లో కామెడీ యాక్షన్ తో పాటు త్రిల్లింగ్ అంశాలు కూడా ఉండడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: