జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనుసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ద హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ చాలా తక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఈమె ఆ పాపులారిటితో స్టార్‌డమ్ సంపాదించుకుంది. అంతేకాదు ఓ వైపు యాంకర్‌గా రాణిస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిగా దూసుకుపోతోంది.తాజాగా పుష్ప సినిమాలో అనుసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఇకపోతే త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి అనుసూయ సిద్ధమవుతోందంటూ వార్తలు వస్తున్నాయి.అయితే అడవి శేష్ హీరోగా వచ్చిన 'క్షణం' సినిమాతో పరిచయమైన అనుసూయ.. 

తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది. కాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తన కెరీర్‌నే మలుపు తిప్పింది. అయితే తాజాగా పుష్పలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్‌లో అలరించింది. ఇకపోతే ప్రస్తుతం అనసూయ..ఓ మలయాళ చిత్రంలో నటించబోతోంది.కాగా  స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న 'భీష్మ పర్వం'లో అనసూయ.. ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే అనసూయ సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల మంచి రెస్పాన్స్ అందుకుంది.ఇక తెలుగులో ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో..హాట్ గా కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

ఇక మరోవైపు తమిళంలో కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవల అనసూయ కాస్త సన్నబడినట్టుగా అనిపిస్తోంది.ఇక ఇదంతా తన బాలీవుడ్ ఎంట్రీ కోసమే అన్న ప్రచారం జరుగుతోంది.ఇకపోతే పుష్ప సినిమా హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.కాగా దీంతో అనసూయ బాలీవుడ్‌కూ పరిచయం అయ్యింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఓ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక మొత్తమ్మీద అనుసూయ బాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: