హీరో రామ్ ప్రస్తుతం వరుసగా మంచి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయోత్సాహం ఆయనలో పూర్తిగా కనిపిస్తుంది. ఆయన హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా మాస్ దర్శకులు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ది వారియర్ అనే సినిమాను దాదాపుగా పూర్తి చేసే స్థాయికి తీసుకు వచ్చిన రామ్ దాని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు.
నార్త్ ఇండియాలో బాగా పాపులారిటీ సంపాదించిన ఈ హీరో తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోగా మారాడు. ఆయన పాత సినిమాలు డబ్ చేసి హిందీలో విడుదల చేస్తుండగా వాటికి భారీ స్థాయిలో స్పందన రావడం విశేషం. ఆయన సినిమాలు అన్నిటినీ కలిపి ఏకంగా 200 కోట్లు వ్యూస్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అలా నార్త్ లో మంచి పేరు సంపాదించుకున్న హీరోల లిస్టులో ఈ హీరో కూడా చేరాడు ఇప్పుడు. నేను శైలజ చిత్రానికి యూట్యూబ్లో 44 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఆతర్వాత హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, ఇస్మార్ట్ శంకర్, హైపర్ వంటి సినిమాలకు సంబంధించిన వ్యూస్ అన్ని కలిపి 200 కోట్లు దాటిపోయింది.
ఆ విధంగా రామ్ ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా తన సత్తాను చాటుకునీ అక్కడ కూడా ఫేమస్ అయ్యే విధంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమా లుగా చేస్తున్నారు. త్వరలోనే ఆయన సినిమాలు కూడా విడుదల అక్కడ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేయడం వలన అభిమానులను ఎంతగానో సంతోషపరుస్తుంది ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా మార్కెట్లో దూసుకుపోయే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఇప్పుడు హీరో ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి