దీనితో ఈ సంవత్సరం టాలీవుడ్ సమ్మర్ విజేత ఎవరు అన్న విషయమై ఇప్పటికే ఇండస్ట్రీలో అనేక ఆశక్తికర చర్చలతో పాటు అంచనాలు కూడ పెరుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ఈ సమ్మర్ రేస్ కు విడుదల కాబోతున్న భారీ సినిమాల బిజినెస్ రెండు వేల ఐదు వందల కోట్ల స్థాయిలో ఉంటుంది అని అంచనాలు వస్తున్న నేపధ్యంలో ఈ సంవత్సరం టాలీవుడ్ సమ్మర్ రేస్ ఏ రేంజ్ కి చేరిందో ఎవరికైనా అర్థం అవుతుంది.
అయితే ఈ సంవత్సరం సమ్మర్ విజేత ఎవరు అన్న ఫలితం తేలకుండానే అప్పుడే ఇండస్ట్రీలో వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ విజేత ఎవరు అన్న విషయమై చర్చలు మొదలు కావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి కారణం ప్రభాస్ నటిస్తున్న భారీ ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు రాబోతున్నట్లుగా చాల ముందుగానే ప్రకటన రావడం ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి పై రామ్ చరణ్ దృష్టి పెట్టాడు.
చరణ్ శంకర్ ల కాంబినేషన్ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న మూవీని వచ్చే నెలలో మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యేలా మాష్టర్ ప్లాన్ వేస్తున్నాడు. ఇలా ఈసినిమాలకు సంబంధించిన లీకులు బయటకు వస్తూ ఉండటంతో సమ్మర్ రేస్ కూడ పూర్తి కాకుండానే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ గురించి లీకులు ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి