పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన రాధేశ్యామ్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా రిజల్ట్ కోసం ఎంతోమంది ప్రభాస్ అభిమానులు మరియు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ విషయం ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ నటించిన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇకపోతే ఆ ఇంటర్వ్యూ లో భాగంగా రాజమౌళిని ప్రభాస్ మీరు భారీ బడ్జెట్ తో చరణ్ మరియు తారక్ లతో తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కనీసం నన్ను గెస్ట్ రోల్ లో కూడా చూపించాలని అనుకోలేదా అంటూ ప్రశ్నించాడు.

అంతేకాదు ఓకే స్క్రీన్ పై మేము ముగ్గురం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ ప్రభాస్ తెలిపాడు. అంతేకాదు దీంతోపాటు ఉ మీరు తలుచుకుంటే నా కోసం కూడా ఒక పాత్రను సృష్టించగలరు అయితే మీ విషయంలో నేను కనబడలేదా అంటూ ప్రభాస్-రాజమౌళి ప్రశ్నించడం జరిగింది అయితే దీనికి గాను రాజమౌళి స్పందిస్తూ  ప్రభాస్ పెద్ద షిప్ లాంటోడని...అంతేకాదు  తను రాసుకున్న సీన్ లో పెద్ద షిప్ అవసరమని భావిస్తే ఆ షిప్ ను తెస్తానని జక్కన్న తెలిపారు. అయితే నేను అడిగితే నువ్వు నటిస్తావు ...కాబట్టి సినిమాలో ఇరికిస్తే బాగోదని సినిమాకు నిజంగా ప్రభాస్ అవసరమని భావిస్తే మాత్రం ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా కన్విన్స్ చేసేవాడినని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

దీని అనంతరం ప్రభాస్-రాజమౌళి ని నాకంటే మీకు తారక్ మరియు చరణ్ ఎక్కువ  ఇష్టం అనుకుంటా అని చెప్పగా దానికి రాజమౌళి నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ సమయంలో ఆ హీరో కంటే మరెవరో నాకు ఎక్కువ కాదు అంటూ రాజమౌళి చెప్పు కు రావడం జరిగింది. అయితే దీని తరువాత వెంటనే ప్రభాస్ రాజమౌళి ఎన్టీఆర్ తో యమదొంగ తెరకెక్కించే సమయంలో ఎన్టీఆర్ హీరోగా మూడు కథలు చెప్పేవారని..అంతేకాదు  ఛత్రపతి సమయంలో తనకు ఒక కథ,మరియు  బాహుబలి సమయంలో మూడు కథలను రాజమౌళి చెప్పారని అయితే చివరకు ఒక విషయం అర్థమైందని ప్రభాస్ అన్నాడు.అయితే  అదేంటి అంటే రాజమౌళి  ఒక సినిమా మా కథ చెప్పేటప్పుడు ఒక కథ కాదు నా మైండ్లో అనేక కథలు ఉంటాయని అంతే కాదు ఆ కథలు పూర్తయ్యేవరకూ గ్యారెంటీ ఉండదని బాహుబలి సినిమా తర్వాతే నాకు ఏ విషయం అర్థం అయిందని ప్రభాస్ చెప్పుకొచ్చాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: