పాత రికార్డులు కూడా తిరగరాసేవాడు ఈ హీరో. ఫీల్ గుడ్ మూవీస్ ని సెలక్ట్ చేసుకుంటూ వల్గారిటీకి దూరంగా..కామెడి కీ దగ్గరగా ఉండే స్టోరీ లైన్లు సెలక్ట్ చేసుకుంటూ జనాల్లో తనకంటూ ఓ స్పేషల్ క్రేజ్ ను సంపాదించుకున్నారు శర్వా. శర్వా సినిమా అంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసి వెళ్లి ఎంజాయ్ చేయచ్చు అనేలా ఉంటుంది అన్న నమ్మకం ఏర్పడింది. అంత బాగుంటాయి మరి శర్వా సినిమాలు.
కానీ , ఏ దిష్టి తగ్గిలిందో ఏమో కానీ గత కొంత కాలంగా ఈ హీరోకి ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా పడటం లేదు సరికదా కనీసం ఆ సినిమా పాజిటివ్ టాక్ ను కూడా తెచ్చుకోలే కపోతున్నాయట. లోపం ఆయనలో ఉందా..లేక టైం బ్యాడ్ నా అనేది అర్ధం కాక శర్వా ఫ్యాన్స్ సైతం బాగా నిరాశ పడుతున్నారు, మా హీరో ఒక్క సినిమా హిట్ కొడితే చూడాలి అంటూ సోషల్ మీడియా వేదికగా శర్వా కి పలు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు.
రీసెంట్ గా రిలీజైన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టిందట.సినిమాలో అయన నటన బాగున్నా కానీ కధలో బలం లేకపోవడంతో సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉండటం తో ఆ హైట్స్ అందుకోలేకపోయిన శర్వా ఫలితంగా మరో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మరి.. అయినా కానీ శర్వా కి ఆఫర్లు బాగా వస్తూనే ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో శర్వానంద్ ఇప్పటికే ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో లెటేస్ట్ సెన్సేషన్ ఉప్పెన ఫేం కృతిశెట్టి ఫీమేల్ లీడ్ రోల్‌లో నటించనుందట. కాగా ఈ సినిమా షూటింగ్ ఆగస్టు తర్వాత మొదలు కానుందని సమాచారం.. అయితే ఈ సినిమా కోసం శర్వా ఎవ్వరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.. సినిమా స్టార్ట్ అయ్యేలోపు ఆయన తన బరువు తగ్గించుకునే పనిలో పడ్డారని తెలుస్తుంది.ఈ మధ్య కొంచెం బొద్దుగా కనిపిస్తున్న శర్వా..తన లుక్స్ మారిస్తే అయినా ..సినిమా హిట్ అవుతుందేమో అని ఇలా ట్రై చేస్తున్నారట. అయితే దీని పై ఫ్యాన్స్ మాత్రం మరోవిధంగా స్పందిస్తున్నారట...నువ్వు స్లిమ్ అయితే చూడటానికి అస్సలు బాగోవు..ఇప్పుడే బాగున్నావు…బరువు తగ్గితే కీర్తిలా అయిపోతావు..వద్దు నువ్వు నీ లానే ఉండు శర్వా'అంటూ తెగ సజీషన్స్ ఇస్తున్నారు. మరీ శర్వా అభిమానుల మాట వింటాడా లేదా అనేది చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి