రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలయ్యి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. బహుబలి సినిమా రేంజిలో కాక పోయినా కూడా ఈ చిత్రం భారీ విజయం సాధించిందని చాలా మంది చాలా రకాలుగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మీడియా వారు ఈ సినిమా గురించిన మంచి మంచి కథనాలు రాస్తూ సినిమాకు భారీ వసూళ్లు వచ్చేలా చేస్తున్నారు.  వసూళ్ళ విషయం పక్కన పెడితే ఈ ఇద్దరు హీరోలను హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.

అందులోనూ వీరిద్దరూ కూడా భారీ స్థాయి స్టార్ హీరోలు కావడం వారిని ఈ సినిమాలో అద్భుతంగా నటించేలా చేయడం కేవలం ఒక్క రాజమౌళి మాత్రమే చెందింది. స్టార్ హీరోలను ఇలాంటి సినిమాలలో  బ్యాలెన్స్ చేసి చూపించడం అంటే అది మామూలు విషయం కాదు. టాలీవుడ్లో స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నే గుర్తొస్తుంది. కాగా ఇందులో అంతగా ఎలివేషన్ హీరోలకు ఇవ్వలేదు. భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా లేవు.

ఒక క్లాస్ సినిమాగా ఇది వచ్చి అందరినీ సంతృప్తి పరిక్సింది. అయితే యాక్షన్ మాత్రం రాలేదనే ఎంతో కొంత అసంతృప్తి అప్పటినుంచి నెలకొంది. ఆ విధం గా ఇద్దరి హీరోలకు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలు యాక్షన్ సన్నివేశాలు అన్నీ కూడా బాగా కుదిరాయి ఈ సినిమాలో. వాటన్నిటిని ఆయన ఎంతో బాగా మేనేజ్ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ సినిమా ద్వారా ఇద్దరు హీరోలను కూడా చూపించడం కేవలం రాజమౌలి కి మాత్రమే సాధ్యం అయింది అని కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. వీరిద్దరికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఎన్నో గొడవలు జరుగుతూ ఉండడం జరగగా సినిమా తరువాత వారంతా సైలెంట్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR