ఇప్పటికే రెండు మూడు సార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ మూవీ ని ఏప్రిల్ 8 వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొదలైంది.నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకి 25 కోట్లు వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. శాటిలైట్ డిజిటల్ డబ్బింగ్ రైట్స్ పరంగా ఈ భారీ మొత్తం కూడా మేకర్స్ సొతం చేసుకున్నారు.అయితే థియేట్రికల్ రైట్స్ పరంగా ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనడంతో 50 కోట్లకు అమ్మేయాలని అంత రావాలని మేకర్స్ ఎంతగానో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారట. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరుగుతుందా? లేదా అనేది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది.ఇక చూడాలి ఈ సినిమా వరుణ్ తేజ్ కి ఎలాంటి హిట్ ఇస్తుందో మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి