యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ,  మారుతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ప్రభాస్,  మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరును ఖరారు చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త  వైరల్ అవుతుంది,  ఈ సినిమా కోసం చిత్ర బృందం ఒక భారీ సెట్ ను నిర్మించినట్లు తెలుస్తోంది.  ఈ సెట్ లోనే రాజా డీలక్స్ సినిమాకు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం నలభై రోజులు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది.

  ఆ 40 రోజుల్లోనే ప్రభాస్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించవలసిందిగా ప్రభాస్,  మారుతి కండిషన్ పెట్టినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు మారుతి 'పక్కా కమర్షియల్'  సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.  ఈ సినిమా జూలై ఒకటవ తేదీన విడుదల కానుంది,  ఈ సినిమా  విడుదల అయిన తర్వాత మారుతి , ప్రభాస్ సినిమా పై ఫోకస్ పెట్టనున్నట్లు  తెలుస్తోంది,  ప్రభాస్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.  రాధే శ్యామ్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది,  ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నాడు.  ప్రస్తుతం ప్రభాస్ , ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆది పురుష్'  సినిమాలో నటిస్తున్నాడు,  ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు,  ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమా తో పాటు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే సినిమాలో కూడా ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు, ఈ  సినిమాలతో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: