అంతే కాదు డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పైన ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం మాత్రం యువ సంచలనం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న చిత్ర బృందం మాత్రం ప్రస్తుతం సినిమాకి చెందిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులలో చాలా బిజీగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎవరూ తీసుకొని పాయింట్‌ని తీసుకుని తెలుగు ప్రజలకు సరికొత్త సినిమాను చూపించనున్నారట దర్శకుడు జయ శంకర్.
నిర్మాతల ప్రొత్సాహంతోనే ఈ సినిమా షూటింగ్ ను దిగ్విజయంగా పూర్తి చేశామని, ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. అలాగే కామెడీ వేలో కూడా ఒక సరికొత్త పాయింట్ ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారట. ఇక ఈ సినిమా తనకు కచ్చితంగా పెద్ద విజయాన్ని అందిస్తుందని, అలాగే సినిమా టైటిల్‌తో పాటు సినిమా విడుదల తేది కూడా తాము త్వరలోనే వెల్లడి చేస్తాము అని దర్శకుడు జయశంకర్ అంటున్నారు. అంతే కాదు, ఈ సినిమాకి 'అరి' అని టైటిల్ ను ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి