ఒకప్పుడు హాస్య భరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో అల్లరి నరేష్. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ నటుడు కామెడీ యాంగిల్ హీరోగా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అదే తరహాలో వరుస చిత్రాలు చేసి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే మహర్షి చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తనలోని మరో యాంగిల్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన అల్లరి నరేష్ 'నాంది' చిత్రంతో తానేంటో నిరూపించాడు. ఒక్క కామెడీ మాత్రమే కాదు పాత్ర ఎంత విభిన్నమైనది అయినా అవలీలగా పండించగల సత్తా తనలో ఉందని నిరూపించారు. అప్పటి వరకు అల్లరి నరేష్ కు ఉన్న క్రేజ్ వేరే నాంది సినిమా తర్వాత ఈ హీరో అందుకున్న ఫాలోయింగ్ వేరే అనే చెప్పాలి.

కాగా ప్రస్తుతం ఈ హీరో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అడవిలో నివాసం సాగించే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం ఆరాటపడే యువకుడిగా వెండితెరపై  పోరాడేందుకు సిద్దం అవుతున్నారు 'అల్లరి' నరేశ్‌. ఇంతకీ ఆ సమస్య ఏమిటి ? ఆ సమస్యకు పరిష్కారం లభించిందా లేదా? అన్నది వెండి తెరపై చూడాలి.

నరేశ్‌ హీరోగా చేస్తోన్న చేస్తున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. రాజేష్‌ దండు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ మోహన్‌ దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు . కాగా నిన్న  మంగళవారం (మే 10) 'అల్లరి' నరేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా  ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇది చూస్తుంటే ఈ చిత్రంలో కూడా నరేష్ ఒక వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తున్నారని అర్థమవుతోంది. ఇప్పటికే డిఫరెంట్ కథాంశంతో వచ్చిన నాంది మూవీ మంచి హిట్ ను అందించింది. ఆ ధైర్యంతోనే మళ్ళీ నరేష్ ఈ విధమైన కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: