ఇటీవల కాలంలో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు హీరో అడవి శేష్. ఇక ఏ పాత్రలో నటించినా  పాత్రకి ప్రాణం పోస్తూ ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే. ఇక గూడచారి అనే సినిమాతో సస్పెన్స్ త్రిల్లర్ పాత్రలను తాను తప్ప మరొకరు బాగా చేయలేరు అంటూ నిరూపించాడు అడవిశేషు. ఇక ఇప్పుడు మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలు కాపాడి ఇక ఉగ్రవాదుల కుట్ర లో ప్రాణాలు కోల్పోయిన భారత సైనిక వీరుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ఒక సినిమాను నిర్మిస్తున్నారు అంటే ఆ సినిమా కథలో ఎంతో బలం ఉంటేనే ముందడుగు వేయరు అంటూ అభిమానులు ఈ సినిమా పై మరింత నమ్మకం పెట్టుకున్నారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్రబృందం బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే అడవి శేష్ హీరోయిన్  సాయి మంజ్రేకర్ ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ లుగా వచ్చారు.


 ఈ సందర్భంగా కమెడియన్ అలీ   అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు అడవి శేష్. ఈ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ మహేష్ బాబేనా అని అడిగిన ప్రశ్నకు.. మహేష్ సర్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ లాంటోడు.  సర్ వల్లే ఇక మేజర్ సినిమా ముందుకు కదిలింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన బ్యాక్ బోన్ లో అండగా నిలబడ్డాడు కాబట్టి మేము ఎంతో ధైర్యంగా సినిమా చేయగలిగామూ అంటూ అడవి శేష్ చెప్పుకొచ్చాడు. అయితే మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో నువ్వు బాగా సెట్ అయ్యావు అంటూ అడవి శేషు పై ప్రశంసలు కురిపించాడు కమెడియన్ అలీ..

మరింత సమాచారం తెలుసుకోండి: