బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న వయస్సు లోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీ తోనే మంచి విజయాన్ని బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దక్కించుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఆలియా భట్ ఆ తర్వాత హైవే , రాజీ వంటి పలు లేడీ ఓరియంటెడ్ సినిమా లలో నటించి నటిగా తనను తాను నిరూపించుకొని ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది.  

ఇలా నటిగా తనను తాను నిరూపించుకున్న ఆలియా భట్ తాజాగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గంగూబాయి కతియావాడి సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ మూవీ లోని ఆలియా భట్ నటనకు కూడా ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. గంగూబాయి కతియావాడి సినిమాతో పాటు అలియా భట్ తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్  టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇలా పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఆలియా భట్ త్వరలోనే హాలీవుడ్ లో కి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాలో ఆలియా భట్ నటించనుంది.  ఈ మూవీ షూటింగ్ కోసం తాజాగా ఆలియా భట్ హాలీవుడ్ కి బయలుదేరింది.  ఈ విషయాన్ని ఆలియా భట్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: