ఈరోజు ఎక్కడ చూసినా ntr అభిమానుల హవానే కనబడుతోంది. ఎందుకంటే ఈరోజు తారక్ పుట్టిన రోజు కనుక. సోషల్ మీడియాలలో అతని అభిమానులు పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది అభిమానులు సామజిక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అనేకచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేకాకుండా కొంతమంది దర్శకులు ఎన్టీఆర్ తో తమ నెక్స్ట్ సినిమా తాలూక అప్ డేట్స్ ఇచ్చారు. దాంతో తారక్ అభిమానుల సంబరాలు మిన్నంటాయి.
 
అదరగొట్టుతున్న ఎన్టీఆర్ ప్రి లుక్స్:
 
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఒక రోజు ముందుగానే బిగ్ సర్ ప్రైజ్ తో గ్రాండ్ ఫెస్టివల్ షురూ చేసాడు కొరటాల శివ. ఈ ప్రిలుక్ టీజర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవల్ కి తగ్గట్టు ఉండటంతో బర్త్ డే సెలబ్రేషన్స్ కి మంచి బూస్టప్ ఇచ్చినట్టు అయింది. కొరటాల శివ ఎన్టీఆర్ ని ఊరమాస్ డైలాగ్ తో కత్తి పట్టిన చేతినే రివీల్ చేశారు. దాంతో సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని చెప్పకనే చెప్పాడు కొరటాల శివ. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా తాలూక మిగతా భాషల్లో టీజర్స్ కూడా తాజాగా రిలీజ్ అయి, మంచి వ్యూస్ రాబడుతున్నాయి.
 
మరో ప్రి లుక్ ఇదే:
 
ఆచార్య సినిమాతో గట్టిగా ఎదురు దెబ్బను తిన్న కొరటాల ఈసారి సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ని ఫిక్స్ చేసారు. కాగా తాజాగా మరో ప్రీలుక్ రిలీజై, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తోంది. అదే NTR31 తారక్ - ప్రశాంత్ నీల్ కాంబో. అవును.. తాజాగా ప్రశాంత్ నీల్ షేర్ చేసిన లుక్ మాస్ ప్రేక్షకులకు సంబరాలు జరుపుకొనేలా ఉత్సాహాన్నిచ్చింది. వరుసగా రిలీజైన ఈ లుక్స్  తారక్ అభిమానులను ఉల్లాస పరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: