రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఎన్నో సినిమాలో నటించి నట కిరిటీ అని పేరు తెచ్చుకున్నాడు..ఆయనకు తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఫ్రెండ్ గా, తండ్రి గా, తాతగా బాబాయ్ గా ఇలా ఎన్నో పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు. మొన్నీమధ్య సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు..ఇప్పుడు మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నడు.


వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా F3. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించగా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.F2 సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో అభిమానుల మధ్య గ్రాండ్ గా జరిగింది..ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో నటులు కూడా అంతకు మించి ఫెమ్ ను అందుకున్నారు.ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించి అందర్నీ నవ్వించనున్నారు రాజేంద్రప్రసాద్. ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ”ప్రస్తుత సమాజానికి f3 మూవీ ఎంతో అవసరం. ప్రతి మనిషికి నవ్వు అవసరం, ఆ నవ్వులు పంచే సినిమా F3. అందరి జీవితాల్లో సమస్యలు ఉంటాయి. వాటన్నింటికి పరిష్కారం నవ్వు. నేను 40 ఏళ్లుగా నవ్వును నమ్ముకొని ఉన్నాను. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను అద్భుతంగా తీశారు.మూవీ హిట్ కాకపోతే గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా మళ్లీ మీ ముందు నేను ఎప్పుడూ నిలబడను, మీకు మళ్ళీ కనపడను. ఈ సినిమా మీద అంత నమ్మకం ఉంది. ఈ సినిమాలో అన్ని పాత్రలు 100 శాతం ప్రేక్షకులను నవ్విస్తాయి. f3 సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని ఆయన అన్నారు..మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..మరింత సమాచారం తెలుసుకోండి: