నేచురల్ స్టార్ నాని తన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికి’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. టాప్ హీరోల సినిమాల హడావిడి అంతా పూర్తి అయిన తరువాత ఎవరితోను పోటీ లేకుండా సమ్మర్ రేస్ పూర్తి అయిన తరువాత నెమ్మదిగా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రావాలని చాలముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పై చాల అంచనాలు కూడ ఉన్నాయి.


అయితే ఈ మూవీని ఒక చిన్న సినిమా టార్గెట్ చేయడం ఆసినిమాను రానా ప్రమోట్ చేయడం షాకింగ్ గా మారింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదల అవుతున్న ఈమూవీని చాల ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. దీనికితోడు ఈ మూవీ ట్రైలర్ కు కూడ మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడంతో ఈ చిన్న మూవీలో ఏదోఒక విషయం ఉంది అంటూ అప్పుడే అంచనాలు వచ్చేస్తున్నాయి.


‘777 ఛార్లీ’ అన్న టైటిల్ తో రష్మిక ఒకనాటి ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీలో ఒక కుక్క కీలక పాత్రను పోషిస్తోంది. దక్షిణాది భాషలు అన్నింటిలోను ఈ మూవీని జూన్ 10 విడుదల చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు సూపర్ సక్సస్ అవుతున్నాయి. దీనితో ’777 ఛార్లీ’ కూడ ఆలిస్టులో చేరి నానీకి ఊహించని షాక్ ఇస్తుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.


గత కొంతకాలంగా నాని వరస ఫెయిల్యూర్స్ ను చూస్తున్నాడు. దీనితో ప్రేక్షకుడు కామెడీని ఇష్టపడుతున్నారు అన్న విషయాన్ని గ్రహించి ఒక చిన్న పాయింట్ చుట్టూ అల్లిన కథ ‘అంటే సుందరానికి’ అయితే అదే కామెడీ టచ్ తో కుక్క తన యజమానికి ఎంత విశ్వాసంగా ఉంటుందో తెలియచేసే సున్నితమైన కథను కామెడీ యాంగిల్ లో ’777 ఛార్లీ’ లో చూపెడుతున్నాడు. దీనితో ఈ రెండు కామెడీ మూవీలలో ఏమూవీ హిట్ అవుతుంది అంటూ అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు ప్రారంభం అయ్యాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: