ఇక ఈటీవీలో ప్రసారమైన పటాస్ షో ద్వారా శ్రీముఖి యాంకర్ గా బాగా గుర్తింపు పొందింది. శ్రీముఖి తన యాంకరింగ్ తో పాటు తన అందంతో కూడా బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని బాగా సొంతం చేసుకుంది. తన యాంకరింగ్ తో చిలిపి చేష్టలతో ఎక్కడ ఉంటే అక్కడ చాలా ఆమె సందడిగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీముఖి జీ తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమప అనే సింగింగ్ షో కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది. అలాగే జాతిరత్నాలు అనే షో ద్వారా కూడా తన యాంకరింగ్ తో బుల్లితెర మీద సందడి ఆమె చేస్తోంది.శ్రీముఖి బుల్లి తెర మీద మాత్రమే కాకుండా వెండితెర మీద కూడా ఆమె తన నటనతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు పాత్ర పోషించిన శ్రీముఖి ఆ తర్వాత కొన్ని సినిమాలలో మంచి పాత్రలో నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించనుంది. ఇదిలా ఉండగా ఎప్పుడు శ్రీముఖి వాయిస్ గురించి ఆమె శరీరాకృతి గురించి ఎవరో ఒకరు అనేక రకాల విమర్శలు చేస్తూ ఉంటారు.కానీ శ్రీముఖి వాటన్నింటిని కూడా సీరియస్గా తీసుకోకుండా చాలా పాజిటివ్ గా ఆక్సెప్ట్ చేస్తుంది.ఇటీవల శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న జాతి రత్నాలు షో కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో అనేది రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమో లో జబర్థస్త్ ఫేమ్ ఇమాన్యుయేల్ శ్రీముఖి మీద సెటైర్లు వేసాడు. ఈ క్రమంలో భీమ్లా నాయక్ సినిమా స్కూప్ చేస్తూ ఇమాన్యుయేల్ డానియల్ శేఖర్ గెటప్ లో బాగా సందడి చేశారు. ఇక ఈ క్రమంలో శ్రీముఖి నిత్యామీనన్ పాత్ర చేస్తూ నా మొగుడు నాయక్ సూపర్ హీరో అని అనగా నీ మొగుడికి షుగర్ ఎక్కువ అని అతను అంటాడు. ఆ తరువాత నాయక్ భార్య అంటే నాయక్ లో సగం అనుకుంటున్నావా? నాయక్ కి డబుల్ అని శ్రీముఖి అంటుంది. ఇక దీంతో ఇమాన్యుయేల్ మాట్లాడుతూ చూస్తేనే తెలుస్తుంది నువ్వు డబుల్ అని అంటాడు.ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: