బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వెండి తెరపై ప్రేక్షకులను అలరించి చాలా కాలమే అవుతుంది. చాలా కాలం పాటు మూవీ లకు దూరంగా ఉన్నా షారుక్ ఖాన్ ప్రస్తుతం మాత్రం వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా షారుక్ ఖాన్ మొదటి పఠాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. 

పఠాన్ మూవీ భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలకు స్పెషలిస్ట్ అయిన ఆనంద్ సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సరసన దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకు ఓం శాంతి ఓం , చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలు తెరకెక్కాయి. ఆ సినిమాలు అన్నీ మంచి విజయాలు సాధించడంతో పఠాన్ సినిమాపై కూడా అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటి అయిన యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. ఎస్ రాజ్ ఫిలిమ్స్ వారికి ఇది 50 వ సినిమా కావడం విశేషం. ఇది ఇలా ఉంటే తాజాగా పఠాన్ చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

పోస్టర్ లో షారుక్ ఖాన్ ఒక గన్ పట్టుకొని పవర్ఫుల్ లుక్ లో నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే పఠాన్ చిత్ర బృందం ఈ సినిమాను హిందీతో పాటు తమిళ మరియు తెలుగు భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.  ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ ని 25 జనవరి 2023 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: