మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. కీయారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా , అంజలి , సునీల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్ సినిమాలు ఏ రేంజ్ గ్రాండ్ గా ఉంటాయో మన అందరికీ తెలిసిందే. పాటల చిత్రీకరణ విషయంలోనూ,  ఫైట్ ల చిత్రీకరణ విషయంలోనూ శంకర్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడు. ఖర్చు ఎంతైనా కానీ గ్రాండియర్ లుక్ వచ్చేంతవరకు సినిమాపై కష్టపడుతూనే ఉంటాడు.  ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ సినిమా విషయంలో కూడా శంకర్ ఇలాగే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న  సినిమాలోని పాటలను శంకర్ అత్యద్భుతంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని పాటలు వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే  యాక్షన్ సన్నివేశాలలో కూడా శంకర్ తన మార్క్ ను ఏమాత్రం తగ్గించుకోకుండా అదిరిపోయే గ్రాండియర్ లుక్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా రామ్ చరణ్ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ ను కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ సన్నివేశం లో భారీ బ్లాస్ట్ లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలా రామ్ చరణ్ మూవీ క్లైమాక్స్ సన్నివేశం కోసం 20 కోట్ల వరకు ఖర్చు పెట్టనునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: